Friday, November 22, 2024

6.4 శాతం పెరిగిన బంగారం దిగుమతులు..

ఏప్రిల్‌-జులై మధ్య కాలంలో బంగారం దిగుమతులు పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో దిగుమతులు 12 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వచ్చేది పండుగల సీజన్‌ కావడంతో భారీగా బంగారం దిగుమతులు జ రిగాయని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటలో తెలిపింది. నెలవారిగా చూస్తే జులైలో 43.6 శాతం దిగుమతులు తగ్గి 2.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది.
ఏప్రిల్‌-జులై మధ్య బంగారం దిగుమతులు గణనీయంగా పెరగడం వల్ల వాణిజ్యలోటు రికార్డ్‌ స్థాయిలో 30 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 10.63 బిలియన్‌ డాలర్లుగా ఉంది. చైనా తరువాత మన దేశమే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మన దేశంలో అభరణాల తయారీ కోసం ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి అభరణాల ఎగుమతులు 7 శాతం పెరిగి, 13.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. భారీ వాణిజ్య లోటు వల్ల 2021-22 సంవత్సరంలో కరెంటు ఖాతాలోటు జీడీపీలో 1.2 శాతానికి చేరింది. 2020-21లో కరెంటు ఖాతాలో మిగులు నమోదైంది. 2021 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో 22.2 బిలియన్‌ డాలర్లతో జీడీపీలో 2.6 శాతంగా ఉన్న కరెంటు ఖాతాలోటు 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి జీడీపీల 1.5 శాతానికి తగ్గి 13.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే దేశ కరెంటు ఖాతాలో లోటు ఏర్పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement