తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి ఎనిమిది వసంతాలు, మనం కళలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ ఎనిమిది ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగామన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు భీమా వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. నిరంతర ప్రగతి- శీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన ఫలితం. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికి గర్వకారణమన్నారు. గత సమైఖ్య రాష్ట్రంలో పాలకులకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి దేశంలో మరే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఎన్నో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లాలో పకడ్బంధీగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని తెలుపుతున్నాని తెలిపారు. రైతు దేశానికే వెన్నముక, ప్రజల ఆకలి తీర్చే అన్నదాత రైతు అన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతు బంధు పథకం ద్వారా 2021-22 యాసంగి కాలానికి ఇంతవరకు 1,77,451 మంది రైతులకు 776.72 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు కుటుంబాలకు ధీమా రైతు భీమా పథకం. జిల్లాలో ఇంతవరకు 359 మంది రైతులు మరణించగా, 318 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 15.90 కోట్ల రూపాయలను ఈ పథకం క్రింద రైతుల నామిని ఖాతాలలో జమచేమన్నారు.
ఎనిమిదేళ్లలో బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేశాం : మంత్రి గంగుల కమలాకర్
Advertisement
తాజా వార్తలు
Advertisement