Sunday, November 10, 2024

Paralympics | భారత్‌కు బ్యాడ్మింటన్‌లో స్వర్ణం… డిస్కస్ త్రోలో రజతం

పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఈరోజు (సోమవారం) భారత్‌ ఖాతాలో మరో స్వ‌ర్ణం, ర‌జ‌త పతకం చేరింది. పురుషుల సింగిల్స్ బ్యాట్మింట‌న్ లో నితిశ్ కుమార్ స్వ‌ర్ణంతో మెరిశాడు. మ‌రోవైపు డిస్కస్ త్రో లో యోగేష్ కతునియా రజత పతకం సాధించాడు.

బ్యాట్మింట‌న్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 3 మ్యాచ్ లో బ్ర‌ట‌న్ కు చెందిన డేనియల్ బెథెల్ తో త‌ల‌ప‌డిన యోగేష్ కతునియా… 21-14, 18-21, 23-21 పాయింట్ల తేడాతో విజ‌యం సాధించాడు.

ఇక త్రోలో బ్రిట‌న్ డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరిలో యోగేష్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడినే బాయిస్టా కొత్త ఒలింపిక్ రికార్డ్ 46.86 మీటర్లతో బంగారు పతకం సాధించగా.. గ్రీస్‌కు చెందిన కన్సాంటియన్స్ 41.32 మీటర్లు విసిరి కాంస్య పతకం అందుకున్నాడు.

కాగా, ఈ విజ‌యాల‌తో పారాలంపిక్స్ లో భార‌త ప‌త‌కాల సంఖ్య 9కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement