పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ అవని లేఖరా స్వర్ణం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. దీంతో పాటు, 2020 పారా ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో అవనీ స్వర్ణం, కాంస్యం గెలుచుకుంది.
దీంతో అవని లేఖరాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పారాలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా అవనీ అని కొనియాడారు. ఆమె అంకితభావం భారతదేశం గర్వించేలా చేస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈరోజు జరిగిన వివిధ ఈవెంట్లలో… కాంస్యం సాధించిన మహిళా షూటర్ మోనా అగర్వాల్‌ను, రజతం సాధించిన షూటర్ మనీష్ నర్వాల్‌ను, స్ప్రింటింగ్‌లో కాంస్యం సాధించిన ప్రీతీ పాల్‌ను మోదీ అభినందించారు.మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు వీరు చూపిస్తున్న అంకితభావం ఇవాళ సాధించిన కాంస్యం ద్వారా ప్రతిఫలించిందని మోదీ పేర్కొన్నారు