Thursday, November 21, 2024

బంగారం, వెండి ధరలు పైపైకి

బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. పసిడి రేటు ఈరోజు స్థిరంగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పసిడి రేటు నిలకడగా కొనసాగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అయితే బంగారం, వెండి ధరలు గత మూడు రోజుల్లో చూస్తే.. పైపైకి చేరాయని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా వెండి రేటు బాగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు బంగారం ధర తగ్గింది. వెండి రేటు మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో ఆగస్ట్ 1న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాములకు రూ. 51,490 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రేటులో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాములకు రూ.47,200 వద్ద ఉంది. బంగారం ధర గత నాలుగు రోజుల్లో చూస్తే.. రూ. 800కు పైగా పెరిగింది. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర ఈరోజు స్థిరంగానే ఉంది. ధరలో మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.63,700 వద్ద కొనసాగుతోంది. వెండి ధర గత మూడు రోజుల్లో చూస్తే.. ఏకంగా రూ. 3,700 పెరిగింది. వెండి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement