అది ఓ లగ్జరీ ఓడ..దాని సొంతదారులు దివాలా తీయడంతో ఇంత పెద్ద ఓడని కొనేందుకు ఎవరూ ముందుకి రాకపోవడంతో ఆ ఓడకి సంబంధించి ఏ భాగానికి ఆ భాగం విడదీసి తుక్కు సామాను కింద అమ్మేయనున్నారట.ఇంతకీ ఆ ఓడ పేరేంటో తెలుసా గ్లోబల్ డ్రీమ్-2. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ లైనర్లలో ఒకటి అవ్వాల్సిన ఓడ ఇది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ క్రూయిజ్ నౌక ఒక్కసారి కూడా సముద్రయానం చేయలేదు. తొలి ప్రయాణమే తుక్కు సామాన్ల యార్డుకు చేస్తోంది. గ్లోబల్ డ్రీమ్-2కు ఓ సోదర నౌక కూడా ఉంది. దాని పేరు గ్లోబల్ డ్రీమ్. దాన్ని మాత్రం సముద్రయానాలకు సమాయత్తం చేసి, అప్పులు తీర్చుకోవాలన్న యోచనలో యాజమాన్యం ఉంది. ఆసియాకు చెందిన డ్రీమ్ క్రూయిజస్ ఈ నౌకల యజమాని. అయితే, కరోనా దెబ్బకు డ్రీమ్ క్రూయిజెస్, దాని మాతృ సంస్థ జెంటింగ్ హాంకాంగ్ ఆర్థికంగా కుప్పకూలాయి. దాంతో, రుణ సంస్థలు ఈ నౌకలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇలా ఒక్కసారి కూడా ప్రయాణించకుండానే ఈ అతిపెద్ద ఓడ అంతరించిపోవడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement