మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా మునుగోడులోనే తిష్టవేశారు. బీజేపీ నేతలు కూడా మునుగోడులోనే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారం సైతం తమకు అందుబాటులో ఉన్న నేతలతోనే ప్రచారం సాగిస్తుంది. ముఖ్యనేతలు ఇంకా రంగంలోకి దిగకపోవడంతో ఆ పార్టీలో కొంత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేదేలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో తన లాంటి హోమ్ గార్డ్స్ ప్రచారం అవసరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని యెద్దేవా చేశారు. ‘‘వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు.. నాతో ఏం పని?. నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది.. కేటీఆర్‌ను అడగండి’’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement