దివాలా ప్రక్రియలో ఉన్న గోఫస్ట్ ఎయిర్ లైన్స్ మే 30 వరకు అన్ని సర్వీస్‌లను రద్దు చేసింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి డబ్బులు వాపస్ ఇస్తామని తెలిపింది. ఇప్పటికే పలు మార్లు సర్వీస్‌లు రద్దు చిసిన గోఫస్ట్ మే 28 తరువాత సర్వీస్‌లు నడపనున్నట్లు ప్రకటించింది. తాజాగా 30 వరకు సర్వీస్‌లు రద్దు చేస్తున్నట్లు శనివారం నాడు తెలిపింది. సర్వీస్‌లు రద్దు చేస్తున్నందుకు ప్యాసింజర్లు మన్నించాలని కోరింది. విమాన సర్వీస్‌లను పునరుద్ధరించడానికి అనుమతి ఇవ్వాలని గో ఫస్ట్ చేసిన విజ్జప్తిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇంత వరకు ఆమోదించలేదు.
పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళికను సమర్పించాలని డీజీసీఏ గో ఫస్ట్ ను కోరింది. విమాన సర్వీస్‌లు పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి ప్రణాళికను సమర్పించాలని కోరినట్లు డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పైలట్లు, సిబ్బంది అందుబాటు, ఆపరేషనల్ ఖర్చుల కోసం నిధులు సమీకరణ, లీజుదారులు, వెండర్స్ అభిప్రాయాలు ఇలా పలు అంశాల వివరాలను డీజీసీఏ కోరింది.