అమరావతి, ఆంధ్రప్రభ: గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని విపత్తుల విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ప్లో, ఔట్ ప్లో 14.09 లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. సహాయక చర్యల్లో మొత్తం ఆరు బృందాలు ఉన్నట్లు- తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఐయినవిల్లి, మామిడికుదురులో 2 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరంలో ఎన్డీఆర్‌ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు కృష్ణా నది వరద ప్రవాహ ఉధృతి పెరుగుతుందని గురువారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద 1.32 లక్షల క్యూసెక్కులు ఉందని శుక్రవారానికి 4లక్షల క్యూసెక్కులు చేరుతుందన్నారు. వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. పూర్తి స్థాయిలో ఉధృతి తగ్గేవరకు లోతట్టు ప్రాంత ప్రజలు, నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.