Saturday, November 23, 2024

మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

తెలంగాణతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం దగ్గర నీటిమట్టం 45 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీగా వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగిందని అధికారులు తెలుపుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement