ఎన్నికల సమయంలో దేవాలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం దేవుడిని వాడుకుంటున్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
దేవాలయాల కడితే ఉద్యోగాలు వస్తాయా? యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్లలో బీజేపీ హయాంలో పెద్దఎత్తున అప్పులు చేశారన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ రాముడు మెచ్చిన పాలన చేస్తానని వెల్లడించారు. రాహుల్ నాయకత్వం ముందు ఈటల రాజేందర్ రాజకీయ జీవితం చిన్నదేనని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే యోధుడు అని కొనియాడారు.