Monday, November 18, 2024

ఏపీలో మరో ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

ఏపీలోని ఆలయాల్లో దేవుడికి రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం మాత్రం ఆగడం లేదు. కుప్పం మండలం బిరుదన్నపల్లి గ్రామంలోని సుమారు 200 ఏళ్ల పురాతన ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా ఈ ఘటనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం వల్లే విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం మం. గోనుగూరు సమీపంలోని బేటగుట్టపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరమన్నారు. వందల కొద్దీ ఘటనలు జరుగుతుంటే జగన్ సర్కారు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ ఘటనలపై వెంటనే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement