ఫిఫా వరర్డ్‌కప్‌ను ముద్దాడాలన్నదే నా లక్ష్యం. ఖతార్ పోరులో మా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. పోలండ్‌పై సాధించిన 3-1 విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెండవ సారి ప్రపంచ కప్ గెలవాలని కలలు కంటున్నాం అని ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబప్పే చెప్పాడు. ఈ ప్రపంచకప్ నాకు కీలకమైనది. ఇది నా కలల పోటీ అని 23 ఏళ్ల యువ ఆటగాడు వెల్లడించాడు. నాలుగేళ్ల క్రితం రష్యాలో ఫ్రాన్స్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించింది. ”నేను ఇక్కడకు పూర్తి సన్నద్ధతతో వచ్చాను. ఇప్పటివరకు అన్నీ సవ్యంగా జరిగాయి. మా లక్ష్యానికి రెండు అడుగుల దూరంలో ఉన్నాం’ అని పారిస్ సెయింట్-జర్మైన్ సూపర్ స్టార్ వివరించాడు. టోర్నమెంట్‌లో కేవలం నాలుగు గేమ్‌లలో ఐదు గోల్స్ చేశాడు.
మొత్తం 11 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్‌తో ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ తరఫున రెండవ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 1958లో స్వీడన్‌లో జరిగిన టోర్నమెంట్‌లో 13 గోల్స్‌చేసిన జస్ట్ ఫాంటైన్ ఇతనికంటే ముందున్నాడు. టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్‌ను గెలుచుకునే అవకాశం గురించి తాను ఆలోచించడం లేదని కైలియన్ స్పష్టంచేశాడు.