పార్క్ చేసిన ఇండిగో విమానం కిందకి గో ఫస్ట్ కారు వెళ్ళింది. దాంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మంగళవారం వీటీ-ఐటీజే ఎయిర్‌క్రాఫ్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ టీ-2లో ఆగి ఉండగా గో ఫస్ట్ కారు కిందకు వెళ్లింది. అలా వెళ్లిన కారు అక్కడే ఆగిపోయింది. ఈ విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సి ఉంది. అయితే కొంతసేపటికే ఆ సమస్య పరిష్కారం అవ్వడంతో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. ఢిల్లీ నుంచి పాట్నాకు అనుకున్న సమయానికి బయలుదేరింది. అయితే ఈ ఘటనపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానాశ్రయ T2 టెర్మినల్‌లోని స్టాండ్ నెంబర్ 201 దగ్గర జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తుందని అధికారులు చెప్పారు. కారు ఎందుకు ఆగిందనేదానిపై విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మద్యం సేవించాడేమోననే అనుమానంతో కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ అని తేలిందని అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement