దివాలా ప్రక్రియలో ఉన్న గోఫస్ట్ సంస్థ పునరుద్ధరణకు 6 నెలల ప్రణాళికను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమర్పించింది. డీజీసీఏ నియమించిన మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్‌పీ) ఈ నివేదికను నియంత్రణ సంస్థకు ఇచ్చారు. గోఫస్ట్ కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఐఆర్‌పీ తన నివేదికలో పేర్కొన్నారు. 26 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 400 మంది పైలట్స్‌తో కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జూన్ 4 వరకు గోఫస్ట్ సర్వీస్‌లను డీజీసీఏ సస్పెండ్ చేసింది. మే 2 నుంచి గోఫస్ట్ సర్వీస్‌లు నిలిచిపోయాయి. గోఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేయడానికి ముందు ఇంధనాన్ని సరఫరా చేస్తున్న చమురు సంస్థలు తమకు రోజువారి చెల్లింపులు చేయాలని కోరాయి. సర్వీస్‌లు ప్రారంభమైన తరువాత కూడా ఇదే నిబంధనను చమురు సంస్థలు పాటించే అవకాశం ఉంది. నిర్వాహణ కోసం రోజువారి తగినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతో గోఫస్ట్ దివాలా పిటీషన్ దాఖలు చేసింది.
విమాన సర్వీస్‌లకు డీజీసీఏ అనుమతి ఇస్తే ఢిల్లి నుంచి శ్రీనగర్ మధ్య, ఢిల్లి- లేహ మధ్య వెంటనే సర్వీస్‌లు నడిపిస్తామని గోఫస్ట్ తెలిపింది. సర్వీస్‌లు ప్రారంభమైన కొద్ద రోజుల్లోనే పుణా, బెంగళూర్, గోవా రూట్లలోనూ సర్వీస్‌లను పునరుద్ధరిస్తామని తెలిపింది. క్రమంగా 8 నుంచి 10 ప్రాంతాలకు విమాన సర్వీస్‌లను నడిపిస్తామని పేర్కొంది. విమాన సర్వీస్‌లను అనుమతి ఇవ్వడానికి ముందు సంస్థ ఏ మేరకు సంసిద్ధంగా ఉందో పరిళీస్తామని డీజీసీఏ తెలిపింది. గోఫస్ట్ సంస్థకు విమానాలను లీజ్‌కు ఇచ్చిన సంస్థల అభ్యర్ధనను డీజీసీఏ త్రోసిపుచడంతో వారు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించారు. లీజుదారులకు చెల్లింపులకు గోఫస్ట్ ఎన్‌సీఎల్‌ఏటీ 90 రోజుల గడువు ఇచ్చింది.
దీంతో ఎలాగైనా సర్వీస్‌లను పునరుద్ధరించాలని భావిస్తున్న సంస్థ పైలట్లు ఇతర సంస్థల్లో చేరకుండా ఉండేందుకు వారికి ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా నెలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఫస్ట్ ఆఫీసర్స్‌కు అదనంగా 50 వేలు చెల్లిస్తామని తెలిపింది. పునరుద్ధరణ ప్రణాళికలో విమానాలతో పాటు, ఎంత మంది పైలట్లు ఉన్నారో, సిబ్బంది వివరాలు ఇలా అన్నింటిని వివర ంగా నివేదిక రూపంలో సమర్పించాలని డీజీసీఏ కోరడంతో ఆరు నెలల ప్రణాళికను సమర్పించింది. గోఫస్ట్‌కు అతి పెద్ద సవాల్ లీజ్‌దారులను ఒప్పించి 45 విమానాలను తమ వద్దే అంటిపెట్టుకోవడంతో ఉంది. ఈ సంస్థలన్నీ విమానాలను డీ రిజిస్ట్రర్ చేసి తమకు అప్పగించాలని చేసిన విజ్జ ప్తిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించడంతో ఈ సంస్థలు ఢిల్లిd హై కోర్టుకు ఆశ్రయించాయి.