బోయింగ్‌తో కలిసిన జీఎంఆర్ టెక్నిక్ హైదరాబాద్‌లో సరకు రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియాలో బోయింగ్ కన్వర్టడ్ సరకు రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న మొదటి సంస్థ జీఎంఆర్ టెక్నిక్. జాతీయ, అంతర్జాతీయ విమానాల కన్వర్షన్ సెంటర్‌గా ఇది పని చేస్తుంది. ఈ సదుపాయం బోయింగ్ మన దేశం నుంచి 1 బిలియన్ సరఫరాల సోర్సింగ్‌కు జత కలవనుంది. మన దేశం గ్లోబల్ కార్గో హబ్‌గా మారాలన్న లక్ష్యానికి ఇది తోడ్పతుందని బోయింగ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మార్క్ అలెన్ చెప్పారు.
ఈ కేంద్రం ఒప్పటి నుంచి పని చేస్తుంది, ఎంత పెట్టుబడి పెడుతుంది అన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. జీఎంఆర్‌తో ఒప్పందంతో ఇండియాలో విస్తరించేందుకు తమకు మంచి అవకాశం కలుగుతుందని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తా చెప్పారు. ఇండియాలో విమాన విడిభాగాలు, లాజిస్టిక్ సెంటర్స్ ఏర్పాటుకు బోయింగ్ 24 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని ఫిబ్రవరిలో ప్రకటించింది.