హైదరాబాద్ : జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ కొరియర్, ఎక్స్‌ప్రెస్ కార్గో షిప్‌మెంట్ కోసం కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఈ మేరకు జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ సేవలను చీఫ్ కమిషనర్ (కస్టమ్స్) బీవీ శివ నాగ కుమారి ప్రారంభించారు. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ ్స ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్‌జీకే కిశోర్‌తో పాటు జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ కస్టమ్స్ సహకారంతో ఈ సరికొత్త సర్వీసును ప్రారంభించారు. జీహెచ్‌ఏసీ టెర్మినల్ ఆవరణలోనే ఈ సేవలు అందుతాయి. కొరియర్ కార్గో షిప్‌మెంట్‌ల దిగుమతి, ఎగుమతి కోసం కొత్త గేట్‌వేగా ఉంటుందని విమానాశ్రయ అధికార ప్రతినిధి వివరించారు. ఈ సేవ.. ఎక్స్‌ప్రెస్ కార్గో క్లియరెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ కస్టమ్స్‌తో అనుసంధానించబడి ఉంది. ఇది అధునాత సెక్యూరిటీ స్క్రీనింగ్, కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్ సాయంతో ఏర్పాటు చేయబడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..