ప్రముఖ యూరోపియన్ కంపెనీ ఎయిరో స్పేస్ కార్పోరేషన్ ఎయిర్‌బస్‌తో జీఎంఆర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్‌లో విద్యార్ధులకు ఎయిర్ కాఫ్ర్ మెయింటెనెస్ ఇంజనీరింగ్‌లో ఎయిర్‌బస్ శిక్షణ ఇవ్వనుంది. కార్యక్రమం ఈ సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. ఎంపీసీ గ్రూప్‌లో ఇంటర్ పాసైన విద్యార్దులు జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌లో చేరవచ్చు.
ఈ విద్యార్ధులకు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెస్ ఇంజనీరింగ్‌లో ఎయిర్‌బస్ శిక్షణ ఇవ్వనుంది. ఇది లైసెన్సీంగ్ సర్టిఫికెట్ కోర్సు అని జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. నాలుగు సంవత్సరాల ఈ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో రెండు సంవత్సరాలు క్లాస్‌రూమ్ స్టడీ ఉంటుంది, రెండు సంవత్సరాలు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెస్‌లో శిక్షణ ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.