Tuesday, November 26, 2024

NASA : 5 లక్షలకు పైగా ప్రోటోస్టార్స్‌తో వెలిగిపోతున్న ప్రాంతం…ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత అరుదైన దృశ్యాన్ని ఫొటో తీసింది. మనం ఉంటున్న మిల్కీ వే గాలక్సీకి హృదయంగా పేరు పడ్డ ప్రదేశాన్ని క్లిక్‌మనిపించింది. సైంటిస్టులు సాగిటేరియస్-సీగా పేరుపెట్టిన ఈ ప్రదేశంలో సుమారు 5 లక్షల నక్షత్రాలు ఉన్నాయి.

వీటిలో అధికభాగం, నక్షత్రాలుగా రూపాంతరం చెందే దశలో ఉన్న ప్రోటోస్టార్స్. ఇవి ఒక్కోటీ మన సూర్యుడికంటే సగటున 30 రెట్లు పెద్దవిగా ఉన్నాయని తెలిసింది. మిల్కీవే గాలక్సీ మధ్యలో భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి భారీ కృష్ణ బిలానికి సమీపంలో ఈ ‘పాలపుంత హృదయం’ ఉంది. ఈ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు గతంలోనే తెలిసినా తొలిసారిగా ఇది కెమెరా కంటికి చిక్కింది. దీంతో, శాస్త్రవేత్తలో ఆశ్చర్యానందాలు వ్యక్తమవుతున్నాయి. పాలపుంత కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేస్తే గాలిక్సీల పుట్టుకకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement