- పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల టౌన్, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సోమవారం రాత్రి రంగనాథ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కళ్యాణ వేడుకల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావులు పాల్గొన్నారు. వారికి ఆలయ పూజారులు ప్రత్యేకంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.