Monday, November 25, 2024

ఐ డ్రాప్స్‌ను వెనక్కి తీసుకున్న గ్లోబల్‌ ఫార్మా.. అమెరికా నుంచి 50వేల ట్యూబ్స్‌ రీకాల్‌

మన దేశానికి చెందిన గ్లోబల్‌ ఫార్మాకు చెందిన ఐ డ్రాప్స్‌లో బ్యాక్టీరియా ఉందని తేలడంతో వాటిని కంపెనీ రీకాల్‌ చేసింది. చెన్నయ్‌ కి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ వీటిని ఉత్పత్తి చేసింది. ఈ కంటి ముందును అమెరికాకు చెందిన డెల్సామ్‌ ఫార్మాద్వారా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ) పరీక్షలో ఐ డ్రాప్స్‌ బ్యాక్టీరియాతో కలుషితం అయినట్లు తేలింది. దీంతో కంపెనీ 50 వేల ఐ డ్రాప్స్‌ బాటిల్స్‌ను వెనక్కి రప్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement