Tuesday, November 26, 2024

గ్లోబల్‌ చెస్‌లీగ్‌.. ఫ్రాంచైజీలు ఇవే..

న్యూఢిల్లిd: ఈనెల 21నుంచి జులై 2 వరకు దుబాయ్‌లో జరగనున్న టోర్నమెంట్‌ ప్రారంభ ఎడిషన్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలను గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జిసిఎల్‌) సోమవారం ఆవిష్కరించింది. ఈ టోర్నమెంట్‌ టెక్‌ మహింద్ర, అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫైడ్‌) మధ్య జాయింట్‌ వెంచర్‌. పోటీలో ఉన్న జట్లు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌, ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో ఒక్కొక్కటి కనీసం 10 గేమ్‌లు ఆడతాయి. జిసిఎల్‌ పురుషులు, మహిళలు, అండర్‌ 21 ఆటగాళ్లు జట్టుగా పోటీపడేందుకు అవకాశం కల్పిస్తుంది.

లీగ్‌ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌తో ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఫ్రాంచైజీ యజమానులు తమ జట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటారు. జిసిఎల్‌ బోర్డు చైర్‌పర్సన్‌ జగదీశ్‌ మిత్రా మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్‌ సాంప్రదాయ చెస్‌ను కొత్త శకంతో మిళితం చేస్తుంది. డిజిటలైజేషన్‌, ఇన్నోవేషన్‌, టెక్నాలజీ ద్వారా అభిమానుల అభిరుచిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పారు.

- Advertisement -

ఆరు ఫ్రాంచైజీలు..

1) యు స్పోర్ట్‌ (అప్‌గ్రాడ్‌ ముంబా మాస్టర్స్‌), 2) ఇన్సూర్‌కోట్‌ స్పోర్ట్‌ ్స (గంగా గ్రాండ్‌ మాస్టర్స్‌), 3) పునీత్‌ బాలన్‌ గ్రూప్‌ (బాలన్‌ అలస్కాన్‌ నైట్స్‌), 4) త్రివేణి ఇంజనీరింగ్స్‌ (త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌), 5) చింగారి యాప్‌ (చింగారి గల్ఫ్‌ టైటాన్స్‌), 6) ఎస్‌జి స్పోర్ట్‌ ్స (ఎస్‌జి అల్ఫైన్‌ వారియర్స్‌).

Advertisement

తాజా వార్తలు

Advertisement