Friday, November 22, 2024

Smriti Irani: పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే మహిళల పట్ల వివక్ష చూప‌డ‌మే…

మహిళలకు పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే మహిళల పట్ల వివక్ష చూపినట్లు అవుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు.
మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ తీసుకోవాలా వద్దా అని గురువారం నాడు రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ఈ ప్రశ్న అడిగారు.. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించి ఈ ఆలోచనను తిరస్కరించారు.

అలాంటి వేతనంతో కూడిన సెలవుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. పిరియ‌డ్స్ మహిళల జీవితంలో ఓ భాగమని, దీన్ని వైకల్యంగా చూడకూడదని ఇరానీ అన్నారు. అయితే, స్మృతి ఇరానీ ఋతుస్రావం గురించి పరిశుభ్రత.. చర్చ ప్రాముఖ్యతను అంగీకరించారు. జాతీయ స్థాయిలో రూపొందించిన ముసాయిదాను రూపొందించినట్లు ఇరానీ తెలిపారు. దేశవ్యాప్తంగా రుతుక్రమం గురించి అవగాహన కల్పించడం… పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులకు ప్రాప్యతను పెంచడం దీని లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement