Friday, November 22, 2024

జూన్ 1 నుంచి గీతం అడ్మిషన్ కౌన్సెలింగ్.. ప్ర‌తిభావంతుల‌కు ఎంట్రీ ఫీజులో రాయితీ

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి దశ ఆన్లైన్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 1 , 2022 నుంచి ప్రారంభం కానుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఇవ్వాల (మంగళవారం) హైదరాబాద్ లో నిర్వహించిన విలేక‌రుల సమావేశంలో వెల్లడించారు. అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2022 )ని దేశవ్యాప్తంగా 83 కేంద్రాల్లో మే 20-26 తేదీల్లో నిర్వహించగా, 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. 27వ తేదీన ఫలితాలను వెల్లడించినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ లో పాల్గొనాలనుకునే విద్యార్థులు admissions.gitam.edu కు లాగిన్ అవ్వాలని, అక్కడ ప్రవేశ పరీక్ష ఫలితాలతో పాటు స్కాలర్షిప్ వివరాలను కూడా అందుబాటులో ఉంచిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

గీతం ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ , ఆర్కిటెక్చర్ , సెన్స్ , ఫార్మసీ , మేనేజ్మెంట్ , లా , హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనెస్ , పబ్లిక్ పాలసీ , నర్సింగ్ , ఫిజియోథెరపీ , పారామెడికల్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రొఫెసర్ రావు వివరించారు. గీతం ప్రవేశ పరీక్షలో వచ్చిన స్కోరు లేదా ర్యాంకు ఆధారంగా మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తున్నామ‌ని, అత్యుత్తమ ప్రతిభా వంతులకు ఎంట్రీ ఫీజులో పూర్తి రాయితీ ఉంటుందన్నారు. ఆ తరువాత ర్యాంకులను బట్టి 75 శాతం , 50 , 25 , 15 శాతం రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. బీటెక్ లో జాయిన్ కావాల‌నుకునే వారు 2022లో నిర్వహించే జేఈఈ మెయిన్ , టీఎస్ ఎంసెట్, ఏపీ ఈఏపీసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మొదట వచ్చిన వారికి ఫ‌స్ట్ ప్ర‌యారిటీ పద్ధతిపై స్కాలర్ షిప్ లు మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు.

ఇక‌.. గాట్ -2022 ఫేజ్ -1 లో మొత్తం 3వేలమంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించగా, అందులో 1,410 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నార‌ని ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పేర్కొన్నారు. ఉపకారవేతనం శాతం గాట్ ఆధారంగా స్కాలర్ షిప్ అందిస్తామన్నారు. 2021-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో గీతం మూడు ప్రాంగణాల నుంచి దాదాపు 3,950 మంది విద్యార్థులు ఎంపికవగా, అందులో హైదరాబాద్ ప్రాంగణం నుంచి వెయ్యి మంది ఉద్యోగాలు పొందినట్టు ప్రొఫెసర్ రావు వివరించారు. గీతంలో అత్యుత్తను ప్రమాణాలను ఐటీ , సేవా రంగాలతో పాటు ప్రధాన పరిశ్రమలెన పలు బహుళ జాతి , దేశీయ కంపెనీలు గుర్తించాయని , ఇది ఏడాదికేడాది ఆయా కంపెనీలు మరిన్ని ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు దోహద పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయకుమార్ , హెడ్ – అడ్మిషన్స్ డాక్టర్ కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement