ప్రియురాలిను ప్రియుడు కిడ్నాప్ చేయడం.. బాధపెట్టడం జరుగుతుంటోంది. అయితే ఇక్కడ జరిగిన ఘటన.. సీన్ రివర్స్.. మాజీ ప్రియుడు బ్రేకప్ కు ఒప్పుకోలేదని అతన్ని కిడ్నాప్ చేసింది ఓ ప్రియురాలు. సిగరెట్ తో కాల్చింది. ఈ సంఘటన కేరళలోని ఎర్నాకులంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే….మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని.. లవర్ ని కిడ్నాప్ చేసింది ప్రియురాలు లక్ష్మీప్రియ.
అక్కడితో ఆగకుండా.. రెండో లవర్ తో కలసి మొదటి లవర్ ను దారుణంగా కొట్టి, సిగరెట్లతో కాల్చింది ప్రియురాలు లక్ష్మీప్రియ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత రెండో లవర్ సహా మరో ఏడుగురితో కలిసి కిడ్నాప్ చేసింది లక్ష్మీప్రియ. విచక్షణా రహితంగా దాడి చేసిన తరువాత దుస్తులు విప్పేసి.. నగ్నంగా రోడ్డుపై పడేశారు. అయితే.. ఈ సంఘటనలో లక్ష్మీప్రియ సహా ముగ్గురు అరెస్ట్ కాగా రెండో లవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.