ఎక్కడైనా మొక్కలు నీడను ఇస్తాయి. అంతేకాకుండా తినడానికి పండ్లు, రకరకాల పూలను కూడా ఇస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనిషి బతకడానికి ఆక్సిజన్ అందిస్తాయి. అయితే ఈ సృష్టిలో మనకు మేలు చేసే మొక్కలే కాకుండా కీడు చేసే మొక్కలు కూడా ఉన్నాయంటే నమ్మగలమా? కానీ ఇది అక్షరాలా నిజం. ఆస్ట్రేలియాలో పెరిగే అలాంటి మొక్కలను ముట్టుకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
గింపీ గింపి అని పిలవబడే మొక్క ఆకును పొరపాటున తాకినా భరించలేని నొప్పి వస్తుందట. ఈ మొక్క ఆకులపై ఉండే సన్నని ముల్లు ఈ నొప్పికి కారణమవుతుందట. దీంతో సదరు వ్యక్తులు ఆ నొప్పి భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని భావిస్తారట. అందువల్లే ఈ మొక్కను సూసైడ్ ప్లాంట్ అని అంటారు. అంతే కాకుండా ఈ మొక్కను స్టింగింగ్ ట్రీ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం డెన్డ్రొక్నైడ్మెరాయిస్. ఒకవేళ మీరు గనక ఆస్ట్రేలియా వెళ్తే ఈ మొక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఈ వార్త కూడా చదవండి: ప్రపంచంలో సమంతాదే అతిపెద్ద నోరు.. గిన్నిస్ రికార్డు