దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేఖ రాశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని, వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో ఆరోగ్య వసతులు పెంచాలని సూచించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. లేఖకు సంబంధించిన ఓ కాపీని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు పంపించినట్లు పేర్కొన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement