కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జీవితం అంతా ధారపోశామని, ఫలితాలతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భావోదేగానికి లోనయ్యారు. ఒక్కో రాష్ట్రంలో తమ ఓటమిని చూసి గుండె రక్తమోడుతోందన్నారు. పార్టీ ఇలా పతనం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇది చూడలేకపోతున్నట్టు చెప్పుకొచ్చాడు. యవన జీవితాన్ని అంతా.. కాంగ్రెస్ పార్టీకే ధారపోశామన్న గులాం నబీ ఆజాద్.. పార్టీలో ఎన్నో బలహీనతలు ఉన్నాయన్నారు. ఈ విషయం గురించి పార్టీలోని నేతలతో చాలా కాలంగా చర్చిస్తూనే ఉన్నామని తెలిపారు.
ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గుర్తించి.. సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే మరికొన్ని ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మార్పు ఎంతో అవసరమని సూచించారు. పార్టీకి కొత్త నాయకత్వం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. జీ-23 నేతలంతా త్వరలో భేటీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని మాత్రం అనుకోలేదని, ఏదో ఒక రాష్ట్రంలో అయినా అధికారంలోకి వస్తుందని భావించానని చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..