ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. అలాగే మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
బారాబంకి జిల్లా, రామ్స్నేహిఘాట్ ప్రాంతంలోని లఖ్‌నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే బస్సు హరియాణా నుంచి బిహార్‌కు వెళ్తోందని చెప్పారు. ప్రమాదం తరువాత క్షతగాత్రులను లఖ్‌నవూ ట్రామా సెంటర్‌కు తరలించారు.