Thursday, September 12, 2024

GHMC – తడిసి ముద్దైన గ్రేటర్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, షేక్‌పేట్, భరత్‌నగర్‌, బోరబండ, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, కోఠి ప్రాంతంలో కుండపోత వాన పడింది.

ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, ఎస్‌ఆర్ నగర్‌లోనూ వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షంలో ముందుకు కదలలేని పరిస్థితుల్లో పలుచోట్ల వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. నేడు కూడా భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎపి ,తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన..

- Advertisement -

ఎపి ,తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని సూచించింది.

నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. సికింద్రాబాద్‌లో కూడా వర్షాలు పడతాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement