జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. నగరంలోని కొన్ని డివిజన్‌లలో మేయర్ ఆకస్మిక తనిఖీ చేయడంతో సిబ్బంది లోపాలను గమనించారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అధికారుల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరాతాబాద్ జోన్ లోని గుడిమల్కాపూర్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీలో చెత్తను చూసి సీరియస్ అయ్యారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలోని రోడ్డు మీద కిలో మీటర్ మేరా చెత్త ఉండడం చూసి మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తీయించాలని అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల చెత్త నిల్వ ఉండడం గమనించారు. అధికారలకు ఆదేశాలు జారీ చేసి పేరుకుపోయిన చెత్తను తీసివేయించారు. నగరంలో ఎక్కడ కోడా చెత్త నిల్వలు కనపడకూడదని మేయర్ స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement