Sunday, November 24, 2024

GHMC – నేటి నుంచి నగరంలో ర్యాలీలు,సభలు, నిరసన ఆందోళనలు నిషేధం …

జంట నగాలలో నేటి నుంచిబీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) అమలు చేయనున్నారు. నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చే ఈ సెక్షన్ నిబంధనలు నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం, ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపారు.

బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) కింద హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు మాత్రం అనుమతి ఉంటుందని ఆ ఉత్తర్వు పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అంతటా నిరసన ప్రదర్శనలను నిషేధించినట్టు తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement