Saturday, November 23, 2024

లాకర్​లో దాచిన 70లక్షల నగలు మాయం.. బ్యాంకు ఉద్యోగుల పనే అంటున్న పోలీసులు

ఓ బ్యాంకు లాకర్​లో దాచుకున్న దాదాపు 70 లక్షల బంగారు నగలు మాయం అయ్యాయి. అయితే ఖాతాదారు కరోనా లాక్​డౌన్​ కారణంగా రెండేండ్లుగా బ్యాంకు వైపు వెళ్లలేదు. పైగా ఆ లాకర్​ను అస్సలు ఉపయోగించడం లేదు. దాన్ని కనీసం ఓపెన్​ కూడా ​ చేయకపోవడంతో బ్యాంకులోని సిబ్బందే ఆ నగలను కొట్టేసి ఉంటారన్న అనుమానాలున్నాయి.

ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఓ జాతీయ బ్యాంకులో తన లాకర్‌లో రూ.70 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి ఖాతాదారు షాక్‌కు గురైంది. అశోక్ నగర్‌కు చెందిన ప్రియాంక గుప్తా అనే బాధితురాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో దొంగతనం జరిగినట్టు వార్త వెలుగులోకి రావడంతో ఆ బ్యాంకు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం బ్యాంకు దోపిడీ వార్త ప్రచారం కావడంతో హై డ్రామా నెలకొంది. బ్యాంకు లాకర్‌లో ఉంచిన రూ.60-70 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు సిహానీ గేట్ పోలీస్ స్టేషన్‌లో గుప్తా ఫిర్యాదు చేసింది.

తాను గత 20 ఏళ్లుగా పీఎన్‌బీలో ఈ బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తున్నానని.. తన బ్యాంక్ లాకర్ నంబర్ 879 అని చెప్పింది ప్రియాంక గుప్తా చెప్పింది. 2019లో బ్యాంక్ లాకర్‌ని తెరిచానని, కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో దాన్ని అస్సలు ఉపయోగించలేదని పేర్కొంది. గత సంవత్సరం (ఫిబ్రవరి 2021)లో పాత కీని ఉపయోగించి నా లాకర్‌ని చాలాసార్లు తెరవడానికి ప్రయత్నించానని, కానీ అది ఓపెన్​ కాలేదని ఆమె తెలిపింది. దీనిపై బ్యాంకు ఉద్యోగులకు సమాచారం కూడా ఇచ్చినట్టు తెలిపింది. అయితే.. బ్యాంకు ఉద్యోగులు తనకు నాకు ఒక నంబర్ ఇచ్చారని, ఆ తర్వాత మళ్లీ తనను సంప్రదిస్తామని చెప్పినట్టు పేర్కొంది. ఈ క్రమంలో తాను వారిని రెండు మూడు సార్లు సంప్రదించినా ఎలాంటి రెస్పాన్స్​ రాలేదని పోలీసులకు తెలిపింది

- Advertisement -

PNB బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరికి కలత చెందిన ఫిర్యాదుదారు ఆమె లాకర్‌లో ఉంచిన నగలు కనిపించకుండా పోయాయని, గుర్తించడానికి మాత్రమే ఆమె లాకర్‌ను తెరిచేందుకు నిర్ణయించుకుంది. కోటి రూపాయల విలువైన నగలు, ఆభరణాలు మాయమైనట్లు బాధితురాలు తెలిపింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి బ్యాంకు ఉద్యోగులపై ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాన్ని పోలీసు అధికారి అలోక్ దూబే ధ్రువీకరించారు. ప్రియాంక గుప్తాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో20 సంవత్సరాలుగా బ్యాంక్ లాకర్ ఉందని, ఇప్పుడు దానిలో రూ. 70 లక్షల విలువైన ఆభరణాలు కనిపించలేదని తమకు ఫిర్యాదు అందినట్టు తలిపారు. బ్యాంకు అధికారుల సమక్షంలో లాకర్ పగులగొట్టగా ఎలాంటి నగలు లేవని, 2019లో ఇక్కడ పనిచేసిన బ్యాంక్ ఉద్యోగులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement