మెగా హీరో వరుణ్ తేజ్ ప్రదాన పాత్రలో నటిస్తున్న సినిమా గని.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మెగా అభిమానులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది గని చిత్రయూనిట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ కూడా అదే రోజు విడుదల కాబోతుండడంతో గని చిత్రం రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది.
‘‘కష్ట సమయంలో మాకు బాసటగా నిలిచిన వారందరి ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ ఈనెల 25న రాబోతుంది. ఈ క్రమంలో మా సినిమా వాయిదా వేసుకున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాము’’ అంటూ ట్వీట్టర్ వేదికగా వివరాలు తెలిపింది మూవీ టీమ్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..