రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం కరోనాపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్య కోసం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కరోనా నివారణలో భాగంగానే టెస్టులు కూడా పెంచాలని.. ముఖ్యంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలన్నారు. ఇందుకోసం ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కరోనా కట్టడికి ఎంత ఖర్చు అయినా వెనుకాడొద్దని.. పోలీసు వైద్య శాఖకు బడ్బెట్‌ను పెంచాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. కరోనా నియంత్రణపై ఢిల్లీ అర్బన్ ప్రాంతాల్లో అధ్యయనం చేయాలని.. కొవిడ్ సెంటర్లలో అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని చెప్పారు. రెండో డోసుకు అవసరమైన వ్యాక్సిన్లను తక్షణమే సమకూర్చుకోవాలని.. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్యాధికారులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ సోకుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం గాంధీలో 150, కోఠి ఈఎన్టీలో 250 బెడ్లు అందబాటులో ఉన్నాయని.. వీటికి తోడు గాంధీలోనే మరో 160, మెహదీపట్నం సరోజిని కంటి ఆసుపత్రిలో 200 బెడ్లను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి హరీశ్ రావు, డీజీపీ, సీపీలు, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు