న్యూఢిల్లీ, ప్రభన్యూస్ : ఆగస్టులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీసీ నాయకులు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాదులోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం నేత గారి ఆహ్వానం మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణతో సమావేశమై జాతీయ స్థాయిలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని 70 శాతం ఏర్పాటు చేసి దేశంలో చరిత్ర సృష్టించారని ఈ సమావేశంలో అభినందనలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..