Wednesday, September 25, 2024

Euro Cup | డ్రా గా ముగిసిన‌ జార్జియా – చెక్ రిపబ్లిక్ మ్యాచ్..

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో గ్రూప్-ఎఫ్‌లోని జార్జియా – చెక్ రిపబ్లిక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే చెక్ రిపబ్లిక్ ఆధిపత్యం చెలాయించింది. అయితే, తొలి అర్ధభాగంలో 45వ నిమిషంలో జార్జియా తొలి గోల్ చేసి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

- Advertisement -

ఇక రెండో అర్ధభాగంలో జోరు ప్రదర్శించిన చెక్ రిపబ్లిక్ 59వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేసింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అలాగే గ్రూప్-ఎఫ్‌లోని చెక్ రిపబ్లిక్ – జార్జియా జట్లు ఒక ఓటమి, ఒక డ్రాతో 1 పాయింట్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement