పేరుతో పాటు జండర్ కూడా మార్పు
ఆమె అభ్యర్ధనకు కేంద్రం ఓకే
అనసూయ నుంచి సూర్యగా మార్పు
అలాగే మిస్ నుంచి మిస్టర్ గా చేంజ్
దేశ చరిత్రలో ఇదే తొలిసారి
ఆంధ్రపభ – హైదరాబాద్ స్మార్ట్ – ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డి మార్చుకుంటానని సవాల్ విసిరాడు. అయితే ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. పేరు మార్పును ప్రభుత్వం కూడా ఆమోదించింది .తాజాగా మరొకరు పేరు మార్చుకున్నారు. పేరే కాదు జెండర్(లింగం) కూడా మార్చుకున్నారు. పేరుతో పాటు జెండర్ మార్చుకున్న వారు మామూలు మహిళ కాదు.
సివిల్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగిని. హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ & సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) చీఫ్ కమిషనర్ (అధీకృత ప్రతినిధి) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా నియమితులైన 35 ఏళ్ల ఎం అనసూయ తన పేరుతో పాటు లింగం కూడా మార్చాలని కోరారు. తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా మార్చాలని, తన లింగాన్ని స్త్రీ నుంచి మగగా మార్చాలని అభ్యర్థించారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అన్ని అధికారిక రికార్డులలో తన పేరు, లింగాన్ని మార్చమని తెలిపింది. భారత సివిల్ సర్వీసెస్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. “Ms M అనుసూయ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక నుంచి అధికారి అన్ని అధికారిక రికార్డులలో ‘Mr M అనుకతిర్ సూర్య’గా గుర్తించబడతారు” అని ఆర్థిక శాఖ పేర్కొంది.
ఇక , అనసూయ నుంచి సూర్యగా మారిన అతడు డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంక్‌కు పదోన్నతి పొందాడు. అతను గత సంవత్సరం హైదరాబాద్‌లో తన ప్రస్తుత పోస్టింగ్‌లో చేరాడు. అతను చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశాడు.