హైదరాబాద్, ఆంధ్రప్రభ : గీతమ్ విశ్వ విద్యాలయంలో ప్రవేశాలకు నిర్వహించే గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -23) నోటిఫికేషన్ విడుదల అయింది. గీతం ప్రో వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డీఎస్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో నోటీపికేషన్ విడుదల చేశారు. మరిన్ని వివరాలకువిద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు దేశ వ్యాప్తంగా 48 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తామన్నారు. గాట్-23తోపాటు జేఈఈ మెయిన్, ఏపీ, తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వైజాగ్, హైదరాబాద్, బెంగళూరుల్లోనూ గీతం క్యాంపసులలో సీట్లు కేటాయిస్తామన్నారు.
గీతం వర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి లిబరల్ ఆర్ ్ట ్స కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అమెరికాలో విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ కోర్సులో బాగంగా బిటెక్ విద్యార్థి మైనర్‌గా తన కోర్సుతో సంబంధం లేని సైకాలజీ సబ్జెక్టును తీసుకోవచ్చని వెల్లడించారు. ఇలా సైన్స్, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్, సోషల్‌సైన్సెస్ 25 వి భాగాల్లో మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవచ్చన్నారు. గీతం హైదరాబాద్‌అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సీ ఉదయ్ కుమార్, అడ్మిషన్స్ విభాగాధిపతికే. శి వకుమార్ తదితరులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.