ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2022-23 మూడో త్రైమాసికం జీడీపీ వృద్ధి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్‌తో ముగిసిన మూడోత్రైమాసికంలో మన దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు 4.4 శాతంగా నమోదైంది. తయారీ రంగంలో క్షీణత వల్ల వృద్ధి రేటు మందగించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఇదే కాలంలో వృద్ధిరేటు 11.2 శాతంగా ఉంది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంక శాఖ కార్యాలయం విడుదల చేసింది.
2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రెండో అంచనాలను కూడా ఎన్ఎస్ఓ ప్రకటించింది. పూర్తి ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. జనవరిలో ప్రకటించిన తొలి అంచనాల్లోనూ 7 శాతం నమోదు కావచ్చని పేర్కొంది. ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధిరేటు 6.8 శాతం వరకు నమోదు కావాలని అంచనా వేశాయి.