Friday, November 22, 2024

gaza: అన్నార్తుల‌పై కాల్పులు.. 20 మంది మృతి, 155 మందికి గాయాలు

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి కేంద్రంగా మారిన గాజాలో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం వేచి చూస్తున్న సమూహంపై జ‌రిగిన‌ కాల్పుల్లో 20 మంది మ‌ర‌ణించారు.. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజాలోని అల్‌ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగంలో పనిచేసే వైద్యుడు మొహమ్మద్‌ ఘ్రాబ్‌ వెల్లడించారు.


ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరైన వసతులు, ఔషధాలు లేవని వెల్లడించింది. ఈ అన్నార్తుల‌పై యుద్ధ ట్యాంకు, శక్తిమంతమైన తుపాకులతో ఇజ్రాయెల్‌ సైనికులు దాడి చేసి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఫిబ్ర‌వ‌రిలోనూ మార‌ణ కాండ..

- Advertisement -

ఫిబ్రవరి 29న సైతం గాజాలో ఇదే తరహాలో దాడి జరిగిన విషయం తెలిసిందే. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపటంతో పాటు కాల్పులకు దిగడంతో 104 మంది మరణించారు. 760 మంది గాయపడ్డారు. తొలుత వైమానిక దాడి జరిపిన ఇజ్రాయెల్‌ సైన్యం ఆ తరువాత ట్రక్కులవద్ద ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement