Tuesday, November 26, 2024

రాజ్యసభకు గాయత్రి రవి ఏకగ్రీవం.. సోమవారం ప్రకటించే చాన్స్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బండా ప్రకాశ్‌ రాజీనామాతో రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఉప ఎన్నిక బరిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) మాత్రమే మిగిలారు.

శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ రెడ్డి నామినేషన్లు పరిశీలించారు. అనంతరం శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్ధి బోజరాజు కోయల్కర్‌ నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రవిచంద్రను ప్రకటించి ధుృవీకరణ పత్రం అందజేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement