ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడంపై మాజీ క్రికెటర్ గంభీర్ తప్పుబట్టాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతడు విమర్శలు చేశాడు. సూర్యకుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, రెండో టీ20లో అతడికి బ్యాటింగ్ అవకాశమే రాలేదని.. అతడి బ్యాటింగ్ తీరు చూడకుండా ఎలా తప్పించారని కోహ్లీని ప్రశ్నించాడు. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీ నిర్ణయం సరికాదన్నాడు. మరో ఏడు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉందని, తొలి ఐదు స్థానాల్లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అందుకు తగ్గ రిజర్వ్ బెంచ్, బ్యాకప్ ప్లేయర్లు ఉండాలని గంభీర్ సూచించాడు. సూర్యకుమార్ యాదవ్‌ను ప్రపంచకప్ నాటికల్లా సానపెట్టాల్సిన బాధ్యత కోహ్లీపైనే ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement