Friday, November 22, 2024

టీ-20 ప్రపంచకప్‌లో పాక్‌తో తలపడే జట్టును ప్రకటించిన గంభీర్

యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 24న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో ముఖాముఖి పోరులో 11 సార్లు గెలుపొందిన టీమిండియా విజయపరంపర కొనసాగించాలని భావిస్తుండగా.. ఒక్కసారైనా పైచేయి సాధించాలని పాకిస్తాన్‌ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో తలపడబోయే టీమిండియా జట్టు ఎంపిక గురించి మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఓపెనర్లుగా ఉండాలని గంభీర్ సూచించాడు. విరాట్‌ కోహ్లీ వన్‌డౌన్‌లో, సూర్యకుమార్‌ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్నాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, వరుణ్‌ చక్రవర్తి, షమీ, బుమ్రా వరుసగా ఆడాలని గౌతీ చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాత్రం తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement