మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో కరోనా రోగులకు ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను పంచిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌లో డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టింది. గౌతం గంభీర్ ఫౌండేషన్ మత్రం అక్రమ రీతిలో ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వ చేసిందని, ఈ కేసులో గంభీర్ ఫౌండేషన్ దోషిగా తేలినట్లు ఢిల్లీ హైకోర్టుకు ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ శాఖ పేర్కొన్నది. డ్రగ్ కంట్రోలర్ తరపున అడ్వకేట్ నందితా రావు వాదించారు. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ కింద గంభీర్ ఫౌండేషన్ నేరం చేసినట్లు అడ్వకేట్ తెలిపారు. ఇదే యాక్ట్ ప్రకారం ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడా దోషిగా తేలినట్లు ఆమె తెలిపారు. దోషిగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు డీజీసీఐని ఆదేశించింది. ఈ కేసులో మళ్లీ జూలై 29న విచారణ జరగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement