Saturday, November 23, 2024

Gaurav Gandhi – 16వేల హార్ట్ స‌ర్జ‌రీలు చేసిన కార్డియాల‌జిస్ట్ గుండెపోటుతో మృతి..

జామ్ న‌గ‌ర్ – 16వేల మందికి పైగా గుండెల‌కు స‌ర్జ‌రీలు ప్రాణం పోసిన ఒక యువ డాక్ట‌ర్ అదే హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించారు.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో హృద్రోగ సమస్యలు ఉన్న 16 వేల మందికిపైగా బాధితులకు కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ ఆపరేషన్స్ చేశారు. ఆయన సోమవారం కూడా రాత్రి వరకు రోగులుకు చికిత్స అందించారు. నైట్ ప్యాలెస్ రోడ్‌లోని తన ఇంటికి వెళ్లి భోజనం అనంతరం నిద్రకు ఉపక్రమించారు. తెల్లారి 6 గంటలు ప్రాంతంలో కుటుంబ సభ్యులు నిద్రలేపేందకు ఆయన రూమ్‌కు వెళ్లారు. ఆయన అపస్మాకర స్థితిలో కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ గౌవర్‌ను బతికించేందుకు డాక్టర్లు రెండు గంటలపాటు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది..

టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్, ‘గుండెపోట్లను అరికడదాం’ అని ఫేస్‌బుక్‌లో చేస్తున్న ప్రచారంలో భాగంగా ఉన్న గౌరవ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో అందర్నీ షాక్‌కు గురిచేసింది. 1982లో జన్మించిన డాక్టర్ గౌరవ్.. జామ్‌నగర్‌లో MBBS కంప్లీట్ చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేశారు. ఆ తర్వాత తిరుగులేని డాక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. దాదాపు 16 వేల యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ హార్ట్ సర్జరీలు చేసిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఆయన భార్య దేవాన్షి గాంధీ డెంటిస్ట్. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement