Friday, November 22, 2024

GATE 2024 ఫలితాలు విడుదల..

గేట్-2024 పరీక్షకు సంబంధించి ఫ‌లితాల‌ను (శ‌నివారం) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్ర‌క‌టించింది. గేట్‌ 2024 పరీక్ష ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించగా.. గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐఐఎస్‌సీ అధికారిక gate2024.iisc.ac.in వెబ్‌సైట్‌లో లాగిన్ వివరాలను ఎంటర్ చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ స్కోర్‌కార్డ్‌లు మార్చి 23నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

ఐఐఎస్‌సీ బెంగళూరు గేట్ 2024 ఫలితాలతో పాటు సబ్జెక్ట్ వారీగా కట్-ఆఫ్ మార్కులను కూడా ప్రకటిస్తుంది. ఈ కటాఫ్‌లను అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్ పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement