న్యూ ఢిల్లీ – అయిదు రాష్ట్రాలకు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేందుకు కేంద క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.. అయిదే ఈ తగ్గింపు దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు 700లకే ఇవ్వాలని నిర్ణయించింది.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా బిపిఎల్ లబ్దిదారులు పొందిన గ్యాస్ కనెక్షన్ లపై మాత్రమే కొంత సబ్సీడీ ఇవ్వాలని క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది.. సిలిండర్ పై రూ 200 సబ్బిడీ సెప్టెంబర్ ఒకటో తేది నుంచి పొందనున్నారు.. ప్రస్తుతం మార్కెట్ ధర 1150 ఉండగా, రూ 250 సబ్సీడీతో సరఫరా చేస్తున్నారు.. కేంద్రం తాజా నిర్ణయంతో ఉజ్వల్ లబ్ధిదారులకు ఇకపై రూ.700లకే సిలిండర్ లభించనుంది.
ఇక సాధారణ గృహ వినియోగ గ్యాస్ ధరలో కూడా రూ.200 తగ్గించింది..దీంతో గ్యాస్ సిలిండర్ 950 కు లభించనుంది.. ఇది ఇలా ఉంటే కొత్త విధానం ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు ప్రతి నెల గ్యాస్ ధరను మార్కెట్ ఆధారంగా తగ్గించడమో, పెంచడమో చేస్తున్నాయి.. ఈ విధానం అమలు అయిన తర్వాత ఇప్పటి వరకు గ్యాస్ ధర ఒక్కసారి కూడా తగ్గలేదు.. ఒకప్పుడు రూ 400లకే లభించే గ్యాస్ సిలెండర్ ఇప్పుడు ఏకంగా 1150కి చేరింది.. తగ్గ్గించాలని గృహిణులు మొర పెట్టకున్నా కేంద్రం మాత్ర కరుణ చూపడం లేదు.. గ్యాస్ కంపెనీలు మాత్రం యధాతథంగా నెల నెల ఎంతకొంత బాదుతూ లాభాలు గడిస్తున్నాయి.. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది.. ఈ ధరలు నేటి నుంచే అమలు కానున్నాయి.