Tuesday, November 26, 2024

Gas Cylinder : సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ వినియోగ‌దారుల‌కు మ‌ళ్లీ షాక్ ఇచ్చింది కేంద్రం. నూత‌న సంవ‌త్స‌రం రోజునే గ్యాస్ ధ‌ర‌లు పెంచి వినియోగ‌దారుల‌కు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే పెరిగిన ధ‌ర‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుండ‌డంతో మ‌ళ్లీ మ‌రో భారం ప‌డింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25 వడ్డించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1768కి చేరింది. ఇక ముంబైలో రూ.1721కి పెరిగింది. తాజా పెంపుతో కోల్‌కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కి చేరింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1105గా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement