Saturday, November 23, 2024

గ్యాస్ బండ ఎప్పుడు అయిపోతుందో ముందే తెలుసుకోవచ్చు..

మన ఇంట్లో గ్యాస్ బండ ఎప్పుడు అయిపోతుందోనని టెన్షన్ పడే వారికి శుభవార్త..ఇక పై గ్యాస్ పూర్తిగా ఎప్పుడు అయిపోతుందో తెలుసుకోవడం సులభం. అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్‌ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది. ఐఓసీఎల్‌ విడుదల చేసిన  స్మార్ట్‌ సిలిండర్లతో గ్యాస్‌  ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా  ఐఓసీఎల్‌ రిలీజ్‌ చేసిన స్మార్ట్‌ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్‌డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్‌ సిలిండర్లు మాదిరి స్మార్ట్‌ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

ఇది కూడా చదవండి : రూ 100 ఇచ్చి సెల్ఫీ దిగండి: మంత్రి ఉషా ఠాకూర్

Advertisement

తాజా వార్తలు

Advertisement